DNews: 15 Sep: నిఫ్టీ గత వారం నుంచి రికవరీని కొనసాగించగా వారం మొత్తంలో 373 పాయింట్ల లాభంతో 25,140 వద్ద ముగిసింది. గత రెండు వారాల్లో నిఫ్టీ 700 పాయింట్ల మేరకు ర్యాలీ సాగించింది. అయినప్పటికీ గత నాలుగు వారాలుగా ప్రధాన స్థాయి 25,000 వద్ద సైడ్ వేస్ కదలికలు కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తం మీద మార్కెట్ గత వారం నిలకడగా ముగిసిన ప్రస్తుతం గతంలో ఏర్పడిన మేజర్ టాప్ 25,200 లకు సమీపంలో ఉంది. రివర్సల్ ఏర్పడిన ఈ స్థాయిలో వరుసగా నాలుగో వారం పరీక్ష ఎదుర్కొంటోంది. తదుపరి దిశ తీసుకునేముందు ఈ స్థాయిలో కన్సాలిడేట్ కావచ్చు. ప్రస్తుత అప్ ట్రెండ్ కొనసాగించాలంటే ఈ స్థాయిలో ఉండి తీరాలి. మిడ్ క్యాప్-100, స్మాల్ క్యాప్-100 సూచీలు సైతం గత వారం ర్యాలీ సాధించాయి.

బ్యాంకు నిఫ్టీ రెండు వారల ర్యాలీ ప్రభావంతో నిఫ్టీ స్వల్ప ఓవర్ బాట్ స్థితిలో ప్రవేశిస్తోంది. మరింత కన్సాలిడేషన్ ఉండవచ్చు అని అనేందుకు ఇది సంకేతం. వీక్లీ చార్టుల్లో 25,200 వద్ద డబుల్ టాప్ ఏర్పడింది. సానుకూలిత కోసం ఇక్కడ బ్రేకౌట్ సాదించాలి. అదే స్థాయిలో “అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్” పైన కూడా నిలదొక్కుకోవాలి.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana