
DNews:02 Dec:నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో రెండో దఫా సర్పంచ్, వార్డ్ మెంబర్ నామినేషన్ల చివరి రోజు మంగళవారం విపరీతమైన హడావిడితో సాగింది. సమయం దగ్గరపడుతున్నందున అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలు ముందుగా సమర్పించుకునేందుకు ఉత్సాహంతో నామినేషన్ కేంద్రాలకు భారీగా తరలివచ్చారు.
సింగోటం నామినేషన్ కేంద్రంలో సింగోటం, యన్మన్ బెట్ల, మాచినేనిపల్లి గ్రామాల అభ్యర్థులు ఒక్కసారిగా చేరడంతో గందరగోళం వాతావరణం ఏర్పడింది. పోలీసుల జోక్యంతో కానివారిని బయటకు పంపించి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే విధంగా సింగోటం, కుడికిల్ల, ఎల్లూరు, రామాపురం, పెద్దకొత్తపల్లి, కోడేరు, పెంట్లవెల్లి మండలాల్లోని నామినేషన్ కేంద్రాలలో కూడా భారీ జనసంచారం గమనించబడింది.
కానీ, బందోబస్తు సరిపడకపోవడం వల్ల నామినేషన్ కేంద్రాల్లో భద్రతా విభాగానికి సవాళ్లు ఎదురైంది. ఒక్క నామినేషన్ కేంద్రానికి ఇద్దరు పోలీస్ బందోబస్తు మాత్రమే ఉండడంతో అభ్యర్థులు, వారి అనుచరుల భీం పెద్దగ ఉండగా, పోలీసులు నియంత్రణ కోల్పోయారు. సమస్యాత్మక గ్రామాల్లో కూడా బందోబస్తు తక్కువగా ఉండటం సంచలనంగా మారింది.నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతుండడంతో, పరిస్థితి ఎలా పరిష్కారమవుతుందనే ఆసక్తికరంగా మారింది.
