
DNews:NOV 12:సుల్తానాబాద్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన సుల్తానాబాద్ మండలంలోని చిన్న బొంకూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మ్యాచర్ వచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టి మిల్లులకు త్వరితగతిన తరలించాలన్నారు. సంఘ కార్యదర్శి రమేష్తో పాటు కొనుగోలు నిర్వాహకులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు.
రైతులు వరి కోతలు ముగించాక ధాన్యాన్ని సరిగ్గా ఆరబెట్టి, మ్యాచర్ వచ్చిన తర్వాత మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. సెంటర్లలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గన్నీస్, లారీలు తదితర సౌకర్యాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
ఈ సందర్బంగా ఆయనతో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి (DCSO), జిల్లా రవాణా అధికారి (DTO) తదితర అధికారులు పాల్గొన్నారు.
