
DNews:27 Nov:తెలంగాణలో పంచాయతీ ఎన్నికల తొలి విడత షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల అధికారులు గురువారం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు నామపత్రాలను దాఖలు చేయవచ్చు.
నామినేషన్ పరిశీలన నవంబర్ 30 తుది జాబితా నవంబర్ 30 సాయంత్రం నామినేషన్ ఉపసంహరణ చివరి తేదీ డిసెంబర్ 3 తొలివిడతలో మొత్తం 4,236 గ్రామాల్లో, 37,450 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి.పోలింగ్ తేదీ డిసెంబర్ 11 సమయం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓట్ల లెక్కింపు అదే రోజు మధ్యాహ్నం ఈ రోజే వార్డు సభ్యులు, సర్పంచ్ ఫలితాలు ప్రకటించనున్నారు.
తొలివిడత ఎన్నికలు జరగబోయే 189 మండలాల పరిధిలోని 4,236 గ్రామాల్లో ఫొటోతో కూడిన ఓటర్ల జాబితాలను కూడా ప్రదర్శించనున్నారు.షెడ్యూల్ ప్రకటించడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. రాజకీయ నాయకులు, అభ్యర్థులు మరియు పార్టీ కార్యకర్తలు గ్రామాల్లో ప్రచార ఏర్పాట్లలో నిమగ్నమౌతున్నారు.
