
DNews:27 Nov:హైదరాబాద్/ఢిల్లీ: తెలంగాణ ఈగల్ టీమ్ గురువారం దేశ రాజధానిలో భారీ అంతర్రాష్ట్ర ఆపరేషన్ నిర్వహించింది. మొత్తం 16 ప్రత్యేక బృందాలతో కలిసి అత్యంత సమన్వయంతో చేసిన ఈ దాడులు ప్రస్తుతం డ్రగ్ మాఫియాలో పెద్ద సంచలనం రేపాయి.సమాచారం మేరకు, ఈగల్ టీమ్స్ ఢిల్లీ పోలీసులతో కలిసి నోయిడా మరియు పరిసర ప్రాంతాల్లో ఒకేసారి విస్తృత తనిఖీలు చేపట్టాయి. ఈ ఆపరేషన్లో నైజీరియన్ డ్రగ్ నెట్వర్క్ను ఛేదించినట్లు తెలిసింది.దాడుల్లో 30 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్, నగదు, కమ్యూనికేషన్ పరికరాలు వంటి కీలక సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.ఢిల్లీ–హైదరాబాద్ డ్రగ్ సరఫరా లింకులపై కొంతకాలంగా ఈగల్ టీమ్ నిఘా పెట్టిన నేపథ్యంలోనే ఈ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ దాడులతో డ్రగ్ మాఫియా నెట్వర్క్పై పెద్ద దెబ్బ పడినట్లు భావిస్తున్నారు.
