
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘జైలర్ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సీక్వెల్ ఇప్పటికే విడుదలైన పాటతో మంచి హైప్ తెచ్చుకుంది. అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త కోలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
‘జైలర్ 2’ సెన్సార్ ప్రక్రియ పూర్తయిందని, సినిమాకు సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ ఇచ్చిందనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వార్తపై చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
మరోవైపు ‘A’ సర్టిఫికెట్ విషయమై రజనీకాంత్ కీలక నిర్ణయం తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. సినిమాకు ‘U/A’ సర్టిఫికెట్ వస్తేనే థియేటర్లలో విడుదల చేయాలని, ‘A’ సర్టిఫికెట్‌తో రిలీజ్ చేయాల్సి వస్తే సినిమాను వాయిదా వేయాలని ఆయన చిత్ర బృందానికి సూచించినట్లు ప్రచారం జరుగుతోంది.
‘జైలర్’ తరహాలో ఈ సినిమాను కూడా అన్ని వర్గాల ప్రేక్షకులు చూసేలా ఉండాలని రజనీ భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ‘A’ సర్టిఫికెట్ కారణంగా కుటుంబ ప్రేక్షకులు, పిల్లలు థియేటర్లకు దూరమైతే అది సినిమా వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉందనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే ఇవన్నీ ప్రస్తుతం వైరల్ అవుతున్న ప్రచారాలు మాత్రమే. ‘జైలర్ 2’ సెన్సార్ సర్టిఫికెట్‌పై సన్ పిక్చర్స్ లేదా సెన్సార్ బోర్డు అధికారికంగా స్పందించాల్సి ఉంది. కాగా భారీ అంచనాల మధ్య ఈ చిత్రాన్ని 2026 అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.
