The Paradise: No Trailer for Nani’s Film.. Here’s Why the Makers Took This Decision

D News: నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’పై రోజుకో ఆసక్తికరమైన అప్‌డేట్ వస్తోంది. సెప్టెంబర్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రబృందం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ట్రైలర్‌పై నాని కీలక ప్రకటన చేశారు.

సినిమా కోసమే ఈ నిర్ణయం

‘ది ప్యారడైజ్’కు ట్రైలర్ విడుదల చేయడం లేదని నాని స్పష్టం చేశారు. ప్రస్తుతం సినిమా పనులు తుది దశలో ఉన్నాయని, మంచి క్వాలిటీతో సినిమాను పూర్తి చేయడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని చెప్పారు.

ట్రైలర్ చేయాలంటే శ్రీకాంత్ ఓదెల, అనిరుధ్‌తో పాటు పలువురు టీమ్ సభ్యులు మరో నాలుగైదు రోజులు దానిపైనే పనిచేయాల్సి ఉంటుందని నాని తెలిపారు. విడుదలకు సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ సమయాన్ని ట్రైలర్ కోసం కాకుండా సినిమాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ఉపయోగించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

ఇప్పటికే ‘ది ప్యారడైజ్’ టీజర్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచింది. తాజాగా మేకర్స్ కూడా సెప్టెంబర్ 24 రిలీజ్‌ను మరోసారి కన్ఫర్మ్ చేశారు. దీంతో ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వస్తున్న నాని సినిమాపై ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీ నెలకొంది.

By Avinash

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana