
వినాయక చవితి వస్తే గణపతికి పాలవెల్లి కట్టడం తప్పనిసరి. కానీ ఎందుకు కడతామో చాలా మందికి తెలియదు. పూర్వీకులు కట్టారు కాబట్టి మనం కూడా చేస్తున్నాం అన్నది సాధారణంగా వినిపించే సమాధానం.
అయితే, నిజంగా చూస్తే ప్రతి ఆచారం వెనుక ఒక శాస్త్రీయమైన అర్థం ఉంటుంది.
సనాతన ధర్మం అనేది కేవలం భక్తి కాదుకదా… అది విజ్ఞానానికి పునాది.
- పాలవెల్లి అంటే పాలపుంత (Milky Way Galaxy)
- ఆ పుంతలోని నక్షత్రాలను సూచించేందుకు పండ్లు, పత్రాలు కడతారు
- గణపతి పూజలో భూమి (మట్టి విగ్రహం), జీవం (పత్రి), ఆకాశం (పాలవెల్లి)
అనే ప్రకృతితత్త్వాలను ఆరాధిస్తారు
ఈ విధంగా, గణపతికి పాలవెల్లి కట్టడం ద్వారా మనం విశ్వాన్ని, ప్రకృతిని సాక్షాత్కరిస్తూ పూజిస్తున్నాం.
🔍 ఆచారాన్ని తెలుసుకుంటే అదొక శాస్త్రం అవుతుంది.
భగవంతుడు అంటే జ్ఞానం – ఋషులు అంటే శాస్త్రవేత్తలు.
వారు చూపించిన దారిలో నడవడం మన బాధ్యత.
