విజయవాడ కనకదుర్గ దేవాలయం దసరా 2025 దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ముస్తాబవుతోంది. ఇప్పటికే గణపతికి తొలిపూజలు చేసి అంకురార్పణ కూడా జరిగింది.

Dussehra Navratri 2025 – Dasara Festival ప్రతియేటా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా నిర్వహించే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది 11 రోజుల పాటు జరగనున్నాయి అనే విషయం తెలిసిందే. సెప్టెంబర్‌ 22వ తేదీన ప్రారంభమయ్యే దసరా శరన్నవరాత్రులు అక్టోబరు 2వ తేదీతో ముగియనున్నాయి. ఈ ఏడాది తిథి వృద్ధి చెందడంతో 2025 దసరా శరన్నవరాత్రులను 11 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. సాధారణంగా ప్రతి యేటా అమ్మవారికి 10 అలంకారాలు ఉంటాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌ 25వ తేదీన కొత్తగా అమ్మవారు కాత్యాయినీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ప్రతి పదేళ్లకు ఒక సారి తిథి వృద్ధి చెందుతుంది. దీంతో దసరా శరన్నవరాత్రులు 11 రోజుల పాటు జరుగుతాయి. ఇంతకు ముందు ఇలా 2016లో 11 రోజుల పాటు జరిగాయి. అప్పుడు కూడా తిథి వృద్ధి చెందడంతో అమ్మవారిని కాత్యాయినీదేవిగా అలంకరించారు. మళ్లీ ఈ ఏడాది ఈ ఏడాది అమ్మవారికి కాత్యాయినీదేవి అలంకారం చేయనున్నారు. అయితే సెప్టెంబర్‌ 29వ తేదీన అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ దసరా పండుగ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజులు (ఈసారి 11 రోజులు) దేవీ నవరాత్రులు ఉంటాయి. చివరిరోజు విజయదశమి కలసి దసరా అంటారు. దసరా పండుగ ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి లేదా శరన్నవరాత్రి అని కూడా అంటారు.

 2016 తర్వాత మళ్లీ ఈ ఏడాదే

దసరా శరన్నవరాత్రులు – అమ్మవారి 11 అలంకారాలు

సెప్టెంబర్‌ 22 – శ్రీ బాలాత్రిపురసుందరిదేవి అలంకారం

సెప్టెంబర్‌ 23 – శ్రీ గాయత్రి దేవి అలకారం

సెప్టెంబర్‌ 24 – శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారం

సెప్టెంబర్‌ 25 – శ్రీ కాత్యాయినీ దేవి అలంకారం

సెప్టెంబర్‌ 26 – శ్రీ మహా లక్ష్మీదేవి అలంకారం

సెప్టెంబర్‌ 27 – శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారం

సెప్టెంబర్‌ 28 – శ్రీ మహా చండీదేవి అలంకారం

సెప్టెంబర్‌ 29 – మూలా నక్షత్రం రోజున శ్రీసరస్వతి దేవి అలంకారం

సెప్టెంబర్‌ 30 – శ్రీ దుర్గా దేవి అలంకారం

అక్టోబర్‌ 1 – శ్రీ మహిషాసురమర్ధిని దేవి అలంకారం

అక్టోబర్‌ 2 – విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం

అమ్మవారి 9 అలంకారాలు పద్య రూపంలో..

ప్రథమం శైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి

తృతీయం చంద్రఘంటేతి, కూష్మాంతేతి చతుర్ధామ్‌

పంచమం స్కంధమాతేతి షష్ఠమం కాత్యాయనీ తిచ

సప్తమం కాళరాత్రంచ మహాగౌరేతి చాష్టమం నవమం సిద్ధితి ప్రోక్త నవదుర్గ ప్రకీర్తిత

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana
పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana