
DNews:19 Feb: బీఆర్ఎస్ పార్టీకి చెందిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి తన హోదాకు మించి మాట్లాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి కడియం చేసిన వ్యాఖ్యలపై వివేకానంద ఘాటుగా స్పందించారు.
రాజకీయ అవసరాల కోసం రంగులు మార్చే కడియం శ్రీహరిలాగా కేసీఆర్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదని, పదవుల కోసం బేరసారాలు చేయలేదని వివేకానంద పేర్కొన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేశారని, ఆయన్ను విమర్శించే అర్హత కడియానికి లేదని వ్యాఖ్యానించారు.
అంతకుముందు, పార్టీ ఫిరాయింపుల అంశంలో కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్పై స్పీకర్ విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ వివాదం రాజకీయంగా మరింత వేడెక్కింది.
