
DNews:19 Nov:హైదరాబాద్ తెలంగాణ రాజకీయం మరోసారి ఉత్కంఠభరితంగా మారింది. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కీలక కాంగ్రెస్ నాయకులు భారీ ఎత్తున పార్టీకి గుడ్‌బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ విమల్ కుమార్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
తెలంగాణ భవన్లో జరిగిన ఈ చేరిక కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఆయన కొత్తగా చేరిన నాయకులకు గులాబీ కండువాలు కప్పి స్వాగతం పలికారు.
పార్టీ మార్చిన అనంతరం విమల్ కుమార్ మాట్లాడుతూ… “కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది. మా కష్టాలను పట్టించుకోలేదు” అని ఆరోపించారు. ఇకపై బీఆర్ఎస్ బలోపేతానికి కట్టుబడి పని చేస్తామని తెలిపారు.శేరిలింగంపల్లి ప్రాంతీయ రాజకీయాల్లో ఈ తాజా మార్పు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.
