
DNews:12 Dec: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఈ డిసెంబర్ 13 (శనివారం) సాయంత్రం ప్రపంచ ప్రఖ్యాత ఫుట్ బాల్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ మరియు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరుగుతోంది. మెస్సీతో సీఎంను ప్రత్యక్షంగా తలపడటం అంటే ఫుట్బాల్ అభిమానులకు భారీ ఉత్సాహం కలిగిస్తోంది.
ఈ భారీ మ్యాచును సురక్షితంగా, సాఫీగా నిర్వహించేందుకు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పలు సూచనలు చేశారు.ఉప్పల్ స్టేడియోలో 39,000 సీట్లు ఉన్నాయని తెలిపారు.టికెట్ ఉన్న వారు మాత్రమే మ్యాచ్కు రావాలని స్పష్టం చేశారు.ప్రేక్షకులు గంట ముందుగానే స్టేడియానికి చేరుకుని సీట్లలో కూర్చోవాలని సూచించారు.ఎక్కువ వాహనాలు వచ్చి ట్రాఫిక్ సమస్యలు ఏర్పడే అవకాశాలున్నందున, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగించమని విజ్ఞప్తి చేశారు.స్వంత వాహనాల్లో వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.
మెస్సీ, సీఎం రేవంత్ మధ్య జరిగే మ్యాచ్ ఫుల్ మ్యాచ్ కాదు, కేవలం కొన్ని నిమిషాల పాటు మాత్రమే జరుగుతుందని కమిషనర్ తెలిపారు.భద్రతకు 2,500 మంది పోలీస్ సిబ్బందిని,450 సీసీ కెమెరాలను,అలాగే 18 ప్లాటూన్స్, 2 ఆక్టోపస్, 10 మౌంటెడ్ పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు.టికెట్ కొనుగోళ్లు – అధికారిక మార్గం మాత్రమేటికెట్లు అధికారికంగా మాత్రమే అందుబాటులో ఉంటాయి.డిస్ట్రిక్ట్ అప్లికేషన్ (District App) ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని కమిషనర్ స్పష్టం చేశారు.మార్కెట్లో బయట ఎక్కడా టికెట్లు కొనవద్దని పాపందించారు.
