Dnews: 11 Sep: భాద్రపద శుద్ధ చవితి రోజు మనం వినాయక చవితి పండుగను జరుపుకుంటాం. అయితే ఒక ఏడాదిలో వినాయక చవితి కాకుండా గణపతిని ఆరాధించడానికి శ్రేష్టమైన రోజు ఒకటి ప్రతి మాసంలో వస్తుంది. అదే సంకష్ట హర చవితి! ఏ కారణం చేతనైనా వినాయక చవితి జరుపుకోని వారు, జీవితంలో తరచుగా ఎదురయ్యే ఆటంకాలు అధిగమించడానికి ప్రతి మాసంలో వచ్చే సంకష్ట గణపతి వ్రతాన్ని ఆచరించడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చునని శాస్త్ర వచనం. ఈ కథనంలో అసలు సంకష్ట హర చవితి అంటే ఏమిటి? ఈ పూజ ఎలా చేయాలి అనే వివరాలు తెలుసుకుందాం.

సంకష్ట హర చవితి వ్రతం అంటే?

జీవితంలో ఎదురయ్యే సంకటాలను అంటే భరించలేని కష్టాలను శాశ్వతంగా పోగొట్టేది సంకష్ట హర చవితి వ్రతం. ఏ కారణం చేత అయినా వినాయక చవితి జరుపుకోని వారు, భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఒక నియమానుసారం సంకష్ట గణపతి వ్రతాన్ని ఆచరిస్తే సంకటాల నుంచి శాశ్వతంగా విముక్తి లభిస్తుందని వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణంలో వివరించి ఉంది.


సంకష్ట హర చవితి వ్రతం ఎప్పుడు?
ప్రతి మాసంలో పౌర్ణమి తరువాత నాలుగో రోజైన బహుళ చవితి రోజు సంకష్ట చవితి వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది. ఈ మాసంలో సెప్టెంబర్ 11 వ తేదీ గురువారం రోజు బహుళ చవితి సందర్భంగా సంకష్ట గణపతి వ్రతాన్ని ఆచరించాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. సంకష్ట హర చతుర్థి పూజ సూర్యాస్తమయం తరువాత చేసుకోవాలి కాబట్టి చవితి తిథి సూర్యాస్తమయం నుంచి రాత్రి వరకు ఖచ్చితంగా ఉండాలని శాస్త్రం చెబుతోంది.

🪔 వ్రత విశేషాలు:

  • ఈ వ్రతం 5, 9, 11 లేదా 21 నెలలు చేయవచ్చు.
  • సాయంత్రం, సూర్యాస్తమయం తర్వాత పూజ చేయాలి.
  • ఉపవాసంతో గణపతిని పూజించి మోదకాలు, అరటిపండ్లు నైవేద్యం పెట్టాలి.
  • ఇంట్లో సాధారణ గణపతి విగ్రహం లేదా చిత్రపటంతో పూజ చేయొచ్చు.
  • ప్రత్యేకంగా గరిక, జిల్లేడు పూలు సమర్పించడం విశేషం.

సంకష్ట గణపతి పూజా విధానం
సంకష్ట గణపతి వ్రతాన్ని ఆచరించే వారు ఆ రోజు సూర్యోదయంతోనే నిద్రలేచి శుచియై పూజామందిరంలో గణపతిని ప్రతిష్టించుకోవాలి. ఇందుకోసం కొత్తగా గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం నిత్యం ఇంట్లో పూజ చేసుకునే గణపతి విగ్రహం కానీ చిత్రపటాన్ని కానీ ప్రతిష్ఠించుకుంటే సరిపోతుంది.

విఘ్నేశ్వర బియ్యంతో మొదలు
ముందుగా ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని అందులో ఒకటింపావు కేజీ బియ్యం, 5 ఎండు ఖర్జూరాలు, 5 పసుపుకొమ్ములు, 5 వక్కలు ఉంచి 11 రూపాయలు దక్షిణ ఉంచి మనసులోని కోరికను గణపతికి చెప్పుకొని ముడుపు మూట కట్టి ఉంచుకోవాలి. గణపతి ముందు కొబ్బరినూనెతో దీపారాధన చేయాలి. నిత్యపూజాదికాలు ముగించుకోవాలి. ముడుపు మూటను గణపతి ముందు ఉంచి ధూప దీపాలతో వినాయకుని పూజించి చిన్న బెల్లం ముక్క, కొబ్బరికాయలు, అరటిపండ్లు సమర్పించాలి. వ్రతం చేసే వారు సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి.


ఉద్యాపన ఇలా
సంకష్ట గణపతి వ్రతాన్ని 5 నుంచి 21 మాసాల పాటు మన వీలును బట్టి చేసుకోవచ్చు. చివరగా ఉద్యాపన చేసే సమయంలో మొదటి మాసంలో వ్రతం ప్రారంభించే సమయంలో ముడుపు కట్టి ఉంచుకున్న బియ్యంతో రవ్వ తయారు చేసుకుని, ఆ రవ్వతో ఉండ్రాళ్ళు తయారు చేసి స్వామికి నివేదించి అందరికీ పంచిపెట్టాలి.

🙏 ఫలితాలు:

  • కష్టాలు తొలగడం
  • కార్యసిద్ధి
  • జ్ఞానం, ఐశ్వర్య ప్రాప్తి

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana