
DNews:05 Dec:హైదరాబాద్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎన్నికల్లో ఫైట్ చేసి గెలవడం తన రక్తంలోనే ఉన్నదని గుర్తు చేశారు. ఈ మేరకు నియోజకవర్గ పరిధిలోని హిమాయత్నగర్, నారాయణగూడ ప్రాంతాలలో రూ.1.40 కోట్ల వ్యయం పెట్టి డ్రైనేజీ, రోడ్ల పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం, అనర్హత వేటు అంశంపై స్పందిస్తూ, “రాజీనామా ప్రస్తావన ఇంకా రావలేదు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను” అని స్పష్టం చేశారు. తనకు ఎన్నికల అనుభవం చాలా ఉందని, ఇప్పటివరకు 11 సార్లు పోటీ చేసి విజయాలు సాధించిన చరిత్ర ఉన్నదని అన్నారు.
సుప్రీంకోర్టులో తన అనర్హత అంశంపై విచారణ జరుగుతోందని, తన వాదనలు వినిపించనున్నాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరో పదేళ్లు అధికారంలో ఉంటేనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తుందని, అలాగే రైజింగ్ తెలంగాణ కోసం ఏర్పాటు చేసిన గ్లోబల్ సమ్మిట్ రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహిస్తుందని దానం నాగేందర్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన అభివృద్ధి కార్యక్రమాలకు భరోసా ఇచ్చి, ప్రజల సంక్షేమం కోసం పని కొనసాగిస్తానని తెలిపారు.
