
DSports 4 Dec:రాయ్‌పూర్: భారత క్రికెట్ జట్టు యువ ఓపెనర్, టెస్టు క్రికెట్‌లో సంచలనం సృష్టించిన యశస్వి జైస్వాల్.. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ముఖ్యంగా వన్డేల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో కూడా రాకరాక వచ్చిన అవకాశాలను జైస్వాల్ పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
టెస్టుల్లో డబుల్ సెంచరీలు, ఇంగ్లాండ్‌పై అద్భుతమైన రికార్డులు సాధించి, టీమిండియా ఓపెనర్‌గా సుస్థిర స్థానం సంపాదించుకున్న జైస్వాల్, వన్డే ఫార్మాట్‌లో తనదైన ముద్ర వేయలేకపోతుండడం అభిమానులను, విశ్లేషకులను నిరాశపరుస్తోంది.
