
DNews: Apr13: ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో ఈ నెల 10వ తేదీన యమునా నదిలో జరిగిన పడవ ప్రమాదం తీవ్ర విషాదాన్ని కలిగిస్తోంది. గత శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇప్పుడు 15కు చేరింది. సోమవారం చేపట్టిన గాలింపు చర్యల్లో సహాయక బృందాలు నది నుంచి మరో రెండు మృతదేహాలను వెలికితీశాయి. మృతులను పంజాబ్‌కు చెందిన యశ్ భల్లా (యువరాజ్) మరియు మోనికాగా వారి కుటుంబ సభ్యులు గుర్తించారు.
