
D Spiritual: Jan 22: గోమాతకు ఉన్న విశిష్టత
గ్రామాల్లోనే కాకుండా కొన్ని ఆలయాల వద్ద కూడా గోమాతను దైవస్వరూపంగా పూజిస్తారు. గోదానం చేయడం అత్యంత పుణ్యకార్యంగా భావిస్తారు. అలాగే గోపంచకాన్ని ఇళ్లు, దేవాలయాల్లో చల్లి శుద్ధి చేసుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం.
గోవుకు ఎందుకు అంత ప్రాధాన్యత?
గోవును గోమాతగా వర్ణించడానికి పురాణాల్లో అనేక కథలు ఉన్నాయి. పురాణాల ప్రకారం గోమాతను సకల దేవతల స్వరూపంగా పేర్కొన్నారు. ఒక్క గోవును పూజిస్తే సర్వదేవతలను పూజించిన ఫలితం లభిస్తుందని విశ్వాసం.
గోపూజ ఫలితం
ఇలాంటి దివ్య స్వరూపం కలిగిన గోమాతను భక్తితో పూజిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని పురాతన కాలం నుంచే ప్రజలు విశ్వసిస్తున్నారు. అందుకే గోపూజను అత్యంత శుభప్రదమైన ఆచారంగా భావిస్తారు.
గోవు శరీరంలో దైవస్వరూపాలు
గోవు ఆసాంతం ఏదో ఒక దైవ స్వరూపం ఉన్నదని పురాణాలు చెబుతాయి. గోవు పాదాలలో ఋణ పితృదేవతలు, గోమేడలో తులసీదళాలు, కాళ్లలో సమస్త పర్వతాలు, మారుతి, నోరులో లోకేశ్వరుడు, నాలుగు చతుర్వేదాలు ఉన్నాయని చెబుతారు.
గోవు ముఖంలో ఉన్న దేవతలు
గోవు భ్రూమధ్యంలో గంధర్వులు, దంతాలలో గణపతి, ముక్కులో శివుడు, ముఖంలో జ్యేష్ఠాదేవి, కళ్లలో సూర్య–చంద్రులు, చెవుల్లో శంఖు–చక్రాలు, కొమ్ముల్లో యముడు – ఇంద్రుడు ఉన్నారని విశ్వాసం.
గోవులో నివసించే ఇతర దేవతలు
ఇక గోవు మూపురంలో బ్రహ్మదేవుడు, గంగడోలులో కాశీ – ప్రయాగ నదులు, కంఠంలో విష్ణువు, భుజాలపై సరస్వతి, రొమ్ములో నవగ్రహాలు కొలువై ఉన్నారని పురాణాలు వివరిస్తాయి.
సర్వదేవతా స్వరూపిణి గోమాత
ఈ విధంగా గోవు శరీరంలో సర్వదేవతలు నివసిస్తున్నట్టుగా పురాణాలు చెబుతాయి. అందుకే గోమాతకు అంతటి ప్రత్యేకత, పవిత్రత లభించిందని భక్తులు విశ్వసిస్తారు.
