
D Spiritual: Dec 17: ఆంజనేయస్వామి దేవాలయాల ప్రాధాన్యం:
భారతదేశంలో ఆంజనేయస్వామి దేవాలయం లేని గ్రామం ఉండదంటే ఎటువంటి అతిశయోక్తి కాదు. ప్రతి గ్రామంలోనూ హనుమంతుని భక్తితో పూజిస్తారు. సాధారణంగా ఇతర దేవుళ్లకు పసుపు లేదా కుంకుమ సమర్పిస్తుంటారు.
ఆంజనేయస్వామికి సింధూరం ప్రత్యేకత:
అయితే ఆంజనేయస్వామికి మాత్రం సింధూరం సమర్పించడం ఆనవాయితీ. హనుమంతునికి సింధూరం అంటే ఎందుకు అంత ఇష్టమో అనే విషయానికి వెనుక ఒక పురాణకథ ఉంది.
సీతమ్మ తల్లి–హనుమంతుడి సంభాషణ:
ఒకరోజు సీతమ్మ తల్లి సింధూరం ధరిస్తుండటం చూసిన ఆంజనేయుడు, “అమ్మా, మీరు సింధూరం ఎందుకు ధరిస్తున్నారు?” అని అడిగాడట. అప్పుడు సీతమ్మ తల్లి, “ఇది ధరిస్తే శ్రీరామచంద్రుడికి మేలు కలుగుతుంది” అని చెప్పిందట.
హనుమంతుని భక్తి భావం:
శ్రీరామునికి మేలు కలుగుతుందన్న మాట హనుమంతునికి ఎంతో నచ్చింది. వెంటనే తన శరీరం మొత్తం సింధూరం పూసుకుని సభకు వెళ్లాడట. అక్కడివారు ఎందుకు ఇలా సింధూరం పూసుకున్నావని అడిగితే, సీతమ్మ చెప్పిన మాటను హనుమంతుడు వారికి వివరించాడట.
శ్రీరాముని వరం:
హనుమంతుని అపార భక్తిని చూసిన శ్రీరామచంద్రుడు ఆనందించి ఒక వరం ఇచ్చాడట. ఎవరైతే నిన్ను సింధూరంతో పూజిస్తారో, వారిని అన్ని కష్టాల నుంచి తాను కాపాడతానని ఆంజనేయుడికి మాట ఇచ్చాడట.
సింధూర పూజ సంప్రదాయం:
అప్పటినుంచి ప్రతి మంగళవారం ఆంజనేయస్వామికి సింధూరం పూసి భక్తిశ్రద్ధలతో పూజ చేయడం ప్రారంభమైంది. అభిషేకం అనంతరం నువ్వుల నూనెతో కలిపిన సింధూరాన్ని స్వామికి సమర్పించడం ఆనవాయితీగా మారింది.
మంగళవారం పూజ విశేషం:
సింధూర పూజ హనుమంతునికి ఎంతో ఇష్టమైనది. అందులోనూ మంగళవారం రోజు సింధూరంతో చేసే పూజను ఆంజనేయస్వామి మరింతగా ఇష్టపడతాడని భక్తుల విశ్వాసం.
