
DET:MAR 10:
తీవ్రమైన గొంతు ఇన్ఫెక్షన్:
మార్చి 7 2026న లక్నోలోని కూల్‌బ్రీజ్ రిసార్ట్స్‌లో సునిధి చౌహాన్ లైవ్ కన్సర్ట్ జరిగింది.అయితే ఆ సమయంలో ఆమె తీవ్రమైన గొంతు ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు.సాధారణంగా ఇటువంటి స్థితిలో గాయకులు విశ్రాంతి తీసుకుంటారు కానీ తనను చూడటానికి వచ్చిన వేలాది మంది అభిమానులను నిరాశపరచకూడదని ఆమె స్టేజ్ ఎక్కారు.
అభిమానులకు క్షమాపణలు:
పాట పాడుతున్న క్రమంలో ఆమె గొంతు సహకరించకపోవడంతో సునిధి ఒక్కసారిగా ఆగిపోయారు.ఈ రోజు నా గొంతు చాలా దారుణంగా ఉంది.నా కెరీర్‌లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదు అని చెబుతూ స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు.తను అనుకున్న స్థాయిలో పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నందుకు ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు.
మద్దతుగా నిలిచిన లక్నో ప్రేక్షకులు:
సునిధి కన్నీళ్లు చూసిన అభిమానులు ఆమెను హేళన చేయకుండా పెద్ద ఎత్తున కేకలు వేస్తూ మద్దతు తెలిపారు.పర్వాలేదు మేడం.. మేము పాడతాం అంటూ వారే పాటలు అందుకోవడం విశేషం.ఈ ప్రేమను చూసి ఆమె మరింత ఎమోషనల్ అయ్యారు.ఆ అనారోగ్యంలో కూడా అభిమానుల కోరిక మేరకు తన వంతు ప్రయత్నం చేసి షోను పూర్తి చేశారు.
