
అమీన్‌పూర్‌లో ఇరిగేషన్ అధికారుల తీరుపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ పేరుతో రోడ్ల విస్తరణ పనులకు ఇరిగేషన్ అధికారులు ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
చెరువుల పరిధిలో పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తున్నా ఇరిగేషన్ అధికారులకు అవి ఎందుకు కనిపించడం లేదని నిలదీశారు. అయితే అమీన్‌పూర్‌లోని బంధంకొమ్ము చెరువు వద్ద 150 అడుగుల రోడ్డుకు మాత్రం అనుమతి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
బంధంకొమ్ము చెరువు వద్ద 150 అడుగుల రోడ్డుకు వారం రోజుల్లో అనుమతి ఇవ్వాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
