D Spiritual: Feb 2: సాధారణంగా ఆలయానికి వెళ్లినప్పుడు ముందుగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాతే గర్భగుడిలోకి ప్రవేశిస్తారు. అయితే గుడి చుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేయాలి, ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అనే విషయాలపై చాలామందికి స్పష్టమైన అవగాహన ఉండదు. భక్తితో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ దేవుడిని ప్రార్థిస్తే ఆయన అనుగ్రహం పొంది కష్టాలు దూరమవుతాయని ప్రజల విశ్వాసం. అయితే ఆలయానికి వెళ్లినప్పుడు గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేసే సమయంలో కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.

మూడు సంఖ్య సత్వ–రజో–తమో గుణాలను, భూర్భువస్సువర్లోకాలను, అలాగే స్థూల–సూక్ష్మ–కారణ శరీరాలను సూచిస్తుంది. అందుకే సాధారణంగా గర్భగుడి చుట్టూ ప్రదక్షిణం చేసేటప్పుడు చేతులు జోడించి నమస్కార ముద్రలోనే ప్రదక్షిణలు చేయాలని శాస్త్రాలు చెబుతాయి. ఆలయంలో గర్భగుడి, ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేయడం సంప్రదాయం. అరుణాచలం వంటి క్షేత్రాలలో కొండ మొత్తం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. దీనిని గిరి ప్రదక్షిణ అంటారు. శ్రీకృష్ణుడు ఇంద్రయాగాన్ని మానిపించి గోవర్ధన పర్వతానికి ప్రదక్షిణ చేయమని చెప్పిన ఘట్టం కూడా ప్రసిద్ధమే.

గుడికి వెళ్లినప్పుడు కొందరు మూడు ప్రదక్షిణలు చేస్తారు, మరికొందరు ఐదు, తొమ్మిది, పదకొండు ఇలా వారికి తోచినన్ని చేస్తుంటారు. ఇంకొందరు తమ మొక్కులు తీర్చుకోవడానికి 108 ప్రదక్షిణలు కూడా చేస్తారు. ఈ విధంగా భక్తులు తమ కోరికలు నెరవేరాలని భావించి వివిధ సంఖ్యల్లో ప్రదక్షిణలు చేస్తుంటారు.

అయితే ప్రతి భక్తుడు ఆలయానికి వెళ్లినప్పుడు తప్పనిసరిగా మూడు ప్రదక్షిణలు చేయాలని సంప్రదాయం చెబుతోంది. మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత బేసి సంఖ్యలో ఎన్ని చేసినా శుభఫలితం ఉంటుందని విశ్వాసం. కొన్ని ఆలయాల్లో అక్కడి చరిత్ర, పురాణాల ఆధారంగా 108 లేదా 116 ప్రదక్షిణలు చేయాలని ప్రత్యేక నియమాలు కూడా ఉంటాయి. కానీ సాధారణంగా ఏ ఆలయానికి వెళ్లినా గర్భగుడి, ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణలు మాత్రం తప్పక చేయాలి. ఆ తరువాతే గర్భగుడిలోకి ప్రవేశించి దేవుడి దర్శనం చేసుకోవడం శ్రేయస్కరమని పెద్దలు చెబుతారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana