
లక్ట్రిక్ స్కూటర్‌ను ఎంపిక చేసేటప్పుడు అత్యంత ముఖ్యమైన నిర్ణయాల్లో ఒకటి అది ఉపయోగించే
రకం. సరైన బ్యాటరీ ఉంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు, పనితీరు మెరుగ్గా ఉంటుంది, అలాగే బ్యాటరీపై ఆందోళనలు కూడా తగ్గుతాయి.
ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎంపిక చేసేటప్పుడు అత్యంత ముఖ్యమైన నిర్ణయాల్లో ఒకటి అది ఉపయోగించే బ్యాటరీ రకం. సరైన బ్యాటరీ ఉంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు, పనితీరు మెరుగ్గా ఉంటుంది, అలాగే బ్యాటరీపై ఆందోళనలు కూడా తగ్గుతాయి. అసలు మార్కెట్‌లో ఎన్ని రకాల ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీలు ఉన్నాయి, ఏవి ఎలాంటి పనితీరును అందిస్తాయి, హీట్‌ను ఎంత తట్టుకుంటాయి, చార్జింగ్ కెపాసిటీ, లైఫ్, మైలేజ్ వంటి విషయాల్లో చాలా మందికి అవగాహన ఉండడం లేదు. ఈ క్రమంలోనే నిపుణులు ఆయా వివరాలను వెల్లడిస్తున్నారు. వీటిని బట్టి ఎలాంటి బ్యాటరీ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనాలో వినియోగదారులకు చాలా సులభంగా అర్థమవుతుంది.
ప్రస్తుతం చాలా వరకు ఎలక్ట్రిక్ స్కూటర్లు, కార్లు లేదా మోటార్ సైకిళ్లలో లిథియం అయాన్ బ్యాటరీని అధికంగా ఉపయోగిస్తున్నారు. ఇది తక్కువ బరువు ఉంటుంది. ఎక్కువ శక్తిని ఇస్తుంది. మైలేజ్ కూడా ఎక్కువగానే వస్తుంది. బ్యాటరీ లైఫ్ సుమారుగా 1వేయి నుంచి 2వేల సైకిల్స్ వరకు వస్తుంది. అలాగే హీట్‌ను గరిష్టంగా 60 డిగ్రీల వరకు తట్టుకుంటుంది. అందువల్ల చాలా వరకు ఎలక్ట్రిక్ వాహనాల్లో ఈ తరహా బ్యాటరీలనే అధికంగా ఉపయోగిస్తున్నారు. ఇక మరో బ్యాటరీ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ లేదా ఎల్ఎఫ్‌పీ. ఇది ప్రీమియం రకానికి చెందినది. లిథియం అయాన్ బ్యాటరీ కన్నా ఇది మరింత మెరుగ్గా పనిచేస్తుంది. ఇంకా తేలిగ్గా ఉంటుంది. అధిక శక్తిని అందిస్తుంది. అలాగే మైలేజ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. బ్యాటరీ లైఫ్ సుమారు 2వేల నుంచి 3వేల సైకిల్స్ వరకు వస్తుంది. హీట్‌ను కూడా లిథియం బ్యాటరీ కన్నా అధికంగా తట్టుకుంటుంది. అయితే ఆ బ్యాటరీలతో పోలిస్తే ఎల్ఎఫ్‌పీ బ్యాటరీల ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. కానీ దీర్ఘకాల మన్నిక, బ్యాటరీ లైఫ్, హీట్, మెరుగైన మైలేజ్ వంటి విషయాల్లో లిథియం అయాన్ కన్నా ఎల్ఎఫ్‌పీ పైచేయి సాధిస్తుంది.
