
D Spiritual: Nov 11: హిందూ ధర్మంలో అనేక ఆచారాలు ఉన్నాయి. వాటి వెనుక అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. అలాంటి వాటిలో ఇంటి ముందు దోషాలు, దిష్టి పోవడానికి కట్టే గుమ్మడికాయ గురించి అనేక సందేహాలు వస్తుంటాయి. ఇప్పుడు ఆ విశేషాలు తెలుసుకుందాం.
సాధారణంగా హిందువులు గృహప్రవేశం రోజున గుమ్మానికి గుమ్మడికాయ కడతారు. మరికొందరు ఇళ్లకు, ఆఫీసుల గుమ్మాలకు కూడా గుమ్మడికాయ కడతారు. పద్ధతి ప్రకారం చెప్పాలంటే, కట్టిన గుమ్మడికాయ కుళ్లకూడదు. అది కుళ్లిపోకుండా లోపలలోపల ముడుచుకుపోయి ఎండిపోతే చాలా మంచిదని చెబుతారు.
అలా కట్టిన గుమ్మడికాయ కుళ్లిపోతే లేదా ఎండిపోతే తిరిగి కొత్తది కట్టుకోవచ్చు. అయితే కొత్త గుమ్మడికాయను ఏ రోజు పడితే ఆ రోజు కట్టకూడదు. ఆదివారం లేదా గురువారం కట్టడం శుభదాయకమని నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ రెండు వారాలు భూతప్రేత పిశాచాలను అరికట్టే వారాలు అని భావిస్తారు.
కొత్త గుమ్మడికాయకు పసుపు, కుంకుమ పెట్టి వాకిట్లో కడతారు. ఇది సర్వబాధా నివృత్తి చేస్తుందని నమ్మకం. గుమ్మడికాయను ఎప్పుడూ గుమ్మానికి కట్టి ఉంచడం చాలా అవసరమని పూర్వీకులు చెబుతారు. ఏడాదికి ఒకసారి మార్చమని ఎక్కడా చెప్పలేదు.
అదేవిధంగా దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పుణ్యదినాల్లో కూడా గుమ్మడికాయను మార్చవచ్చు. కానీ చిద్రమైన గుమ్మడికాయను మాత్రం ఇంటి ముందు ఉంచకూడదు.
