D Spiritual: Aug 22: 2026 వినాయక చవితి ఎప్పుడు? తేదీ, పూజా ముహూర్తం పూర్తి వివరాలు

చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే పండుగల్లో వినాయక చవితి ఒకటి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి వాడ, గల్లీలో వినాయకుడి విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజలు, భజనలు నిర్వహిస్తారు. అయితే 2026లో వినాయక చవితి పండుగ ఎప్పుడు వస్తుందనే విషయంలో చాలామందికి సందేహాలు ఉన్నాయి.

2026లో వినాయక చవితి సెప్టెంబర్ 14న జరుపుకోనున్నారు. చవితి తిథి సెప్టెంబర్ 14 ఉదయం 7:06 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 15 ఉదయం 7:44 గంటలకు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 14న వినాయక చవితి పూజలు నిర్వహించుకోవచ్చు.

వినాయకుడి ప్రతిష్ఠాపనకు సెప్టెంబర్ 14న ఉదయం 11:02 గంటల నుంచి మధ్యాహ్నం 1:31 గంటల వరకు శుభ ముహూర్తం ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించడం శుభప్రదంగా భావిస్తారు.

పురాణాల ప్రకారం వినాయకుడు మధ్యాహ్న సమయంలో జన్మించాడని నమ్మకం ఉంది. అందువల్ల మధ్యాహ్న సమయంలో వినాయకుడిని ప్రతిష్ఠించి పూజించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. భక్తులు ఈ ముహూర్తాన్ని అనుసరించి గణపతిని ప్రతిష్ఠించుకోవచ్చు.

అలాగే వినాయక చవితి రోజున సెప్టెంబర్ 14న ఉదయం 9:01 గంటల నుంచి రాత్రి 8:09 గంటల వరకు చంద్రుడిని చూడకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ సమయంలో చంద్రుడిని చూడటం వల్ల మిథ్యా దోషం ఏర్పడుతుందని, తద్వారా అపనిందలు ఎదుర్కోవాల్సి వస్తుందని భక్తుల విశ్వాసం.

వినాయకుడిని పది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజించిన అనంతరం సెప్టెంబర్ 25, శుక్రవారం రోజున వినాయక నిమజ్జనం నిర్వహించనున్నారు. నిమజ్జనంతో ఈ ఏడాది వినాయక చవితి వేడుకలు ముగుస్తాయి.

ఈ పది రోజుల పాటు భక్తులు ఉదయం, సాయంత్రం స్నానమాచరించి వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. గణపతి పూజ చేయడం ద్వారా కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి నెలకొంటాయని, కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana