D Spiritual: Mar 10: హిందువుల ముఖ్యమైన పండుగల్లో శ్రీరామనవమి ఒకటి. ప్రతి సంవత్సరం ఈ పండుగను పల్లెల్లో, పట్టణాల్లో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తారు. అయితే 2026 సంవత్సరంలో శ్రీరామనవమి పండుగ ఎప్పుడు వస్తుంది? తేదీ, సమయం వంటి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హిందూ మతంలో పవిత్రమైన పండుగల్లో శ్రీరామనవమి ఎంతో ప్రాముఖ్యత కలిగినది. చైత్ర మాసంలోని శుక్ల పక్షంలో తొమ్మిదవ రోజున శ్రీరాముడు జన్మించినట్లు పురాణాలు చెబుతాయి. అందువల్ల ప్రతి సంవత్సరం చైత్ర మాసం శుక్ల పక్షం నవమి రోజున శ్రీరామనవమి పండుగను గ్రామాలు, పట్టణాల్లో భక్తి భావంతో ఘనంగా జరుపుకుంటారు.

అయితే 2026 సంవత్సరంలో శ్రీరామనవమి తేదీ విషయంలో చాలా మందికి సందేహం ఉంటుంది. ఈ సంవత్సరం మార్చి 26, 2026 గురువారం రోజున నవమి తిథి ప్రారంభమవుతుంది. అందువల్ల కొందరు భక్తులు ఆ రోజునే శ్రీరామనవమి వేడుకలను నిర్వహిస్తారు.

మరోవైపు సూర్యోదయ తిథిని అనుసరించే వారు మార్చి 27, 2026 శుక్రవారం రోజున శ్రీరామనవమిని జరుపుకుంటారు. ఈ రోజున ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా ఉంది.

పండితుల సూచనల ప్రకారం ఈ సంవత్సరం ప్రధానంగా శ్రీరామనవమి వేడుకలు మార్చి 27 శుక్రవారం రోజున జరుపుకుంటారు. చైత్ర మాసం శుక్ల పక్షం నవమి రోజున శ్రీరాముడు మధ్యాహ్న సమయంలో పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నం, అభిజిత్ ముహూర్తంలో జన్మించాడని విశ్వసిస్తారు. అందువల్ల ఆ రోజు ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:41 గంటల వరకు శ్రీరామజయంతి పూజలు చేయడానికి శుభ సమయంగా భావిస్తారు.

శ్రీరామనవమి రోజున భక్తులు ఉదయం స్నానం చేసి రామనామ జపం చేస్తే పుణ్యం లభిస్తుందని విశ్వాసం.

గమనిక: ఈ సమాచారమంతా మత విశ్వాసాలు మరియు పండితుల సూచనల ఆధారంగా ఇవ్వబడింది. పాఠకుల ఆసక్తి మేరకు అందించిన ఈ వివరాలకు శాస్త్రీయ ఆధారాలు ఉండకపోవచ్చు. ఈ విషయాలను టీవీ9 తెలుగు స్వయంగా ధృవీకరించలేదని గమనించాలి.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana