D Spiritual: Nov 14: మన దేశంలో అనేక ఆచారాలు. వాటిలో చాలావరకు మంచివి.కొన్ని మధ్యలో వచ్చి చేరినవి. ప్రస్తుతం గోళ్ల గురించి తెలుసుకుందాం…

జ్యోతిష్య శాస్త్ర వివరణ ప్రకారం గోళ్లు, జుట్టు కత్తిరించుట:

జ్యోతిష్య గ్రంథాల వివరణల ప్రకారం, మంగళవారం మరియు శుక్రవారం నాడు గోళ్లు మరియు జుట్టు కత్తిరించడం సరైనది కాదు. మంగళవారం దుర్గాదేవికి, శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజులు. ఈ రోజుల్లో గోళ్లు లేదా జుట్టు కత్తిరించడం అదృష్టాన్ని దురదృష్టంగా మార్చవచ్చని కొందరు నమ్ముతారు. ముఖ్యంగా మంగళవారం నాడు జుట్టు కత్తిరిస్తే రక్త సంబంధిత రోగాలు వచ్చే అవకాశం ఉంటుందని, అలాగే శని, కుజుడి ప్రభావంతో ఈతిబాధలు తప్పవని జ్యోతిష్య గ్రంథాలు వివరిస్తున్నాయి. గోళ్లు, జుట్టు రెండూ శరీరంలో భాగం కాబట్టి, ఈ రోజుల్లో వాటిని కత్తిరించకూడదని భావిస్తారు.

మంగళ, శుక్రవారాల్లో గోళ్లు కత్తిరించడం నిషిద్ధం:

మంగళవారం మరియు శుక్రవారం పూర్తిగా గోళ్లు కత్తిరించడం నిషిద్ధమని చెప్పబడుతోంది. జుట్టు కత్తిరించుకునే రోజునే గోళ్లను కూడా తీసుకోవడం ఉత్తమం. మంగళ గ్రహానికి కుజుడు ఆధిపత్యం వహిస్తాడు, ఇతను యుద్ధ కారకుడు. అందుకే అతను ఆధిపత్యం వహించే మంగళవారం కాకుండా ఇతర రోజుల్లో గోళ్లు కత్తిరించుకోవడం శ్రేయస్కరం. ఈ కారణాల వల్లనే మంగళ, శుక్రవారాల్లో గోళ్లను, జుట్టును కత్తిరించకూడదని పెద్దలు సూచిస్తారు.

గోళ్లు కత్తిరించుకోవడానికి సరైన రోజులు, సమయాలు:

సోమవారం, బుధవారం, గురువారం, శనివారం మరియు ఆదివారాలు జుట్టు కత్తిరించుకోవడానికి లేదా గోళ్లను తీసుకోవడానికి అనుకూలమైన రోజులుగా పరిగణిస్తారు. గోళ్లను కత్తిరించేటప్పుడు సూర్యోదయానికి పూర్వమే, స్నానాదికాలు పూర్తిచేయక మునుపే తొలగించుకోవాలి. అలాగే, ఇంటి బయట మాత్రమే గోళ్లను కత్తిరించడం మంచిది. పెద్దలు చెప్పిన ఈ నియమాలను పాటించడం వల్ల మేలే తప్ప నష్టం ఉండదని వారి నమ్మకం.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana