DSports 03Feb 2026:దుబాయ్: ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన దాయాదుల పోరుపై పాకిస్థాన్ ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే, ఐసీసీ తన నిబంధనల ప్రకారం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. కేవలం ఒక మ్యాచ్‌ను మాత్రమే బహిష్కరిస్తామన్న పాక్ వాదనను ఐసీసీ తిరస్కరించింది. ఈ క్రమంలో ఐసీసీ నిబంధనల ప్రకారం జరిగే పరిణామాలు ఇవే:

  • భారత్‌కు ‘వాకోవర్’ పాయింట్లు ఐసీసీ నిబంధనల ప్రకారం, మ్యాచ్ సమయానికి ఒక జట్టు మైదానంలోకి రాకపోతే ప్రత్యర్థి జట్టుకు ‘వాకోవర్’ లభిస్తుంది.షెడ్యూల్ ప్రకారం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ కోసం మైదానంలోకి వస్తారు.పాక్ కెప్టెన్ రాకపోతే, మ్యాచ్ రిఫరీ భారత్‌ను విజేతగా ప్రకటించి 2 పాయింట్లు కేటాయిస్తారు.
  • నెట్ రన్ రేట్ (NRR)పై ప్రభావం పాకిస్థాన్ మ్యాచ్ ఆడకపోవడం వల్ల వారి సెమీఫైనల్ అవకాశాలు దెబ్బతింటాయి.నిబంధన 16.10.7 ప్రకారం, మ్యాచ్‌ను వదులుకున్న జట్టు ఆ 20 ఓవర్లలో సున్నా పరుగులు చేసినట్లుగా పరిగణిస్తారు.దీనివల్ల పాక్ నెట్ రన్ రేట్ భారీగా తగ్గిపోతుంది. అయితే, భారత్ ఆడలేదు కాబట్టి టీమిండియా రన్ రేట్‌లో ఎటువంటి మార్పు ఉండదు (కేవలం పాయింట్లు మాత్రమే వస్తాయి).
  • ఆర్థిక ఆంక్షలు మరియు జరిమానాలు ఐసీసీ టోర్నీ ఒప్పందాల ప్రకారం, ప్రతి దేశం అన్ని మ్యాచ్‌లు ఆడతామని హామీ ఇస్తూ ‘పార్టిసిపేషన్ అగ్రిమెంట్’పై సంతకం చేస్తుంది.నిధుల నిలిపివేత ఐసీసీ నుండి పాకిస్థాన్‌కు అందే వార్షిక ఆదాయంలో భారీగా కోత విధించే అవకాశం ఉంది.నష్టపరిహారం బ్రాడ్‌కాస్టర్లకు కలిగే వేల కోట్ల నష్టాన్ని పీసీబీ నుంచే వసూలు చేసేలా ఐసీసీ నిబంధనలు రూపొందించవచ్చు.
  • సభ్యత్వంపై వేటు?క్రికెట్‌లో రాజకీయ జోక్యం ఉండకూడదన్నది ఐసీసీ ప్రాథమిక సూత్రం. ఒకవేళ పాక్ ప్రభుత్వం పట్టుబట్టి మ్యాచ్‌ను అడ్డుకుంటే, ఐసీసీ బోర్డు పాకిస్థాన్ సభ్యత్వాన్ని తాత్కాలికంగా రద్దు చేసే లేదా టోర్నీ మొత్తానికి వారిని అనర్హులుగా ప్రకటించే అధికారం కలిగి ఉంది.ఐసీసీ హెచ్చరిక “ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్లలో జట్లు తమకు నచ్చిన మ్యాచ్‌లే ఆడతామనడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధం. ఇది కేవలం ఒక్క మ్యాచ్ సమస్య కాదు, మొత్తం టోర్నీ ఉనికికే ప్రమాదం.”