
DSports 03Feb 2026:హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. 2023 ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదుపై విచారణ చేపట్టిన అంబుడ్స్‌మన్ జస్టిస్ సురేష్ కుమార్ కైత్, ప్రస్తుత అధ్యక్షుడు జగన్ మోహన్ రావును పదవి నుంచి తొలగిస్తూ నేడు (ఫిబ్రవరి 3, 2026) సంచలన తీర్పునిచ్చారు. ఆయన స్థానంలో గెలాక్సీ క్రికెట్ క్లబ్‌కు చెందిన అమర్నాథ్ను నూతన అధ్యక్షుడిగా ప్రకటించారు.
- 2023 అక్టోబర్ 20న జరిగిన ఎన్నికల్లో జగన్ మోహన్ రావు ‘శ్రీ చక్ర క్లబ్’ ప్రతినిధిగా పోటీ చేశారు. అయితే, ఆ క్లబ్ పేరు మార్పు చట్టవిరుద్ధమని, జగన్ సమర్పించిన పత్రాలు ఫోర్జరీవని అమర్నాథ్ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేశారు. ఆ ఎన్నికల్లో జగన్ మోహన్ రావుకు 63 ఓట్లు రాగా, అమర్నాథ్కు 62 ఓట్లు వచ్చాయి. కేవలం ఒక్క ఓటు తేడాతో అమర్నాథ్ ఓడిపోయారు. జగన్ మోహన్ రావుపై అవినీతి, ఫోర్జరీ కేసులు ఉండటం, ఆయన ఇప్పటికే అరెస్ట్ అయ్యి బెయిల్‌పై ఉండటం వంటి కారణాల దృష్ట్యా ఆయన పదవిలో కొనసాగడానికి అనర్హుడని అంబుడ్స్‌మన్ స్పష్టం చేశారు.
- అసోసియేషన్ కార్యకలాపాలు ఆగిపోకూడదనే ఉద్దేశంతో, ఆ ఎన్నికల్లో రన్నరప్‌గా నిలిచిన అమర్నాథ్ను తక్షణమే అధ్యక్షుడిగా గుర్తిస్తున్నట్లు అంబుడ్స్‌మన్ తన 12 పేజీల ఉత్తర్వులో పేర్కొన్నారు. వారం రోజుల్లోగా అమర్నాథ్ బాధ్యతలు స్వీకరించాలని, మిగిలిన పదవీ కాలం (సుమారు 9 నెలలు) ఆయనే అధ్యక్షుడిగా కొనసాగుతారని ఆదేశించారు.
“ఇది న్యాయానికి దక్కిన విజయం. హెచ్‌సీఏలో అవినీతిని ప్రక్షాళన చేసి, తెలంగాణ జిల్లాల్లో అట్టడుగు స్థాయి నుంచి క్రికెట్‌ను అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. మహిళా, పురుష క్రికెటర్లకు మెరుగైన వసతులు కల్పిస్తాం.”
