
DSports 03 Dec:న్యూఢిల్లీ: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి వార్తల్లోకెక్కారు. దేశవాళీ వన్డే టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనడానికి ఆయన ఆసక్తి చూపడం లేదని వస్తున్న నివేదికలు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)ను ఇరకాటంలోకి నెట్టాయి. కేవలం వన్డే ఫార్మాట్‌కు మాత్రమే పరిమితమైన సీనియర్ ఆటగాళ్లు, మ్యాచ్ ఫిట్‌నెస్ నిరూపించుకోవడానికి దేశవాళీ క్రికెట్‌లో ఆడటం తప్పనిసరి అని బీసీసీఐ పరోక్షంగా సూచించిన నేపథ్యంలో కోహ్లీ నిర్ణయం కీలకంగా మారింది.
