
DSports Dec23 2025:చండీగఢ్: రానున్న విజయ్ హజారే వన్డే టోర్నీ కోసం పంజాబ్ సెలక్షన్ కమిటీ 18 మందితో కూడిన పటిష్టమైన జట్టును ప్రకటించింది. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న స్టార్ క్రికెటర్లు జట్టులోకి రావడంతో పంజాబ్ టీమ్ అత్యంత బలంగా కనిపిస్తోంది.
పంజాబ్ తన మొదటి మ్యాచ్‌ను డిసెంబర్ 24న జైపూర్‌లో మహారాష్ట్రతో ఆడనుంది.టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్, విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ, స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.
జట్టును ప్రకటించినప్పటికీ, ఇంకా కెప్టెన్ పేరును అధికారికంగా వెల్లడించలేదు. గిల్ అందుబాటులో ఉన్నందున అతనే జట్టును నడిపించే అవకాశం ఉంది.పంజాబ్ తన లీగ్ దశలో మొత్తం 7 మ్యాచ్‌లను జైపూర్ వేదికగానే ఆడనుంది.
జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో టీమ్ ఇండియా వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఆ సిరీస్‌కు గిల్, అభిషేక్, అర్ష్‌దీప్‌లు ఎంపికైతే, వారు విజయ్ హజారే ట్రోఫీలో కేవలం కొన్ని లీగ్ మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
