
DSports Dec24 2025:బెంగళూరు: ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టుకు టాస్ కలిసిరాలేదు. ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దీంతో నితీశ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్ర జట్టు ముందుగా బ్యాటింగ్‌కు దిగింది.
ఈ మ్యాచ్‌పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొనడానికి ప్రధాన కారణం విరాట్ కోహ్లీ. సుమారు 15 ఏళ్ల తర్వాత కోహ్లీ మళ్లీ దేశవాళీ వన్డే టోర్నీ (విజయ్ హజారే) ఆడుతున్నారు. ఢిల్లీ తుది జట్టులో కోహ్లీ చోటు సంపాదించడంతో ఆయన బ్యాటింగ్ చూడాలని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఢిల్లీ జట్టుకు రిషభ్ పంత్ సారథ్యం వహిస్తుండగా, కోహ్లీ ఒక ప్లేయర్‌గా బరిలోకి దిగడం విశేషం.
