
DSports Dec24 2025:వడోదర/నాగ్‌పూర్: టీమ్ ఇండియాతో జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న వైట్ బాల్ సిరీస్ కోసం న్యూజిలాండ్ తమ బలగాలను సిద్ధం చేసింది. అయితే, ఈ పర్యటనలో కివీస్ జట్టుకు గాయాల బెడద గట్టిగానే తగిలింది. రెగ్యులర్ కెప్టెన్ సహా పలువురు సీనియర్లు అందుబాటులో లేకపోవడంతో యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించారు.వన్డే కెప్టెన్‌గా మైఖేల్ బ్రేస్‌వెల్: రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ గజ్జల్లో గాయం (Groin Injury) కారణంగా వన్డే సిరీస్‌కు దూరమయ్యారు. దీంతో ఆల్‌రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్ వన్డే జట్టు పగ్గాలు చేపట్టనున్నారు. అయితే శాంట్నర్ టీ20 సిరీస్ నాటికి కోలుకుంటారని భావిస్తూ అతడినే టీ20 కెప్టెన్‌గా ప్రకటించారు.
