
D Spiritual: Nov 8: నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి ఒక్కరూ తప్పకుండా కనీసం 8 గంటలు నిద్రపోవాలని నిపుణులు చెబుతారు. అయితే, కొంతమంది ఒత్తిడి, కుటుంబ సమస్యల కారణంగా సరిగా నిద్రపోలేరు. కానీ, మరికొంతమంది ఎలాంటి టెన్షన్ లేకపోయినా ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోలేకపోవడానికి ప్రధాన కారణం వాస్తు దోషాలు కావచ్చని నిపుణులు అంటున్నారు. రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోతే, మీ బెడ్‌రూమ్‌లో వాస్తు దోషాలు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. అంటే, ఏ వస్తువులు ఎక్కడ ఉన్నాయి, బెడ్‌లు సరైన దిశలో ఉన్నాయా లేదా అని పరిశీలించుకోవాలి.
బెడ్‌రూమ్‌లో అద్దం ఉంచడం వాస్తు ప్రకారం అస్సలు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బెడ్‌రూమ్‌లో అద్దం ఉండటం వలన వాస్తు సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని, అంతేకాకుండా ఇది మీ నిద్రకు భంగం కలిగించే అవకాశం ఉందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే, చాలా మంది తెలియక బెడ్‌రూమ్‌లోనే భోజనం చేస్తుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం బెడ్‌రూమ్‌లో తినడం అస్సలు మంచిది కాదంట. దీని వలన ఇంటిపై వాస్తు ప్రభావం ఎక్కువగా ఉండి, రాత్రిళ్లు సరిగ్గా నిద్రపట్టకపోవడం, నిద్రపోవడంలో ఇబ్బందులు తలెత్తడం జరుగుతుందంట. అందుకే బెడ్‌రూమ్‌లో తినకూడదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
అంతేకాకుండా, వాస్తు శాస్త్రం ప్రకారం, బెడ్‌రూమ్ ఈశాన్య దిశలో ఉండటం సరికాదంట. ఈశాన్య దిశలో మంచం ఉండటం వలన నిద్ర భంగం కలుగుతుందని, ఇది వాస్తు ప్రకారం కూడా అస్సలు మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.
