D Spiritual: Sept 15: భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. అయితే థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో మాత్రం వినాయకుడికి భక్తులు వినూత్నంగా నైవేద్యం సమర్పిస్తున్నారు. సాధారణంగా గణేశుడికి మోదకాలు, లడ్డూలు వంటి మిఠాయిలను నైవేద్యంగా పెట్టడం తెలిసిందే. కానీ బ్యాంకాక్‌లోని ఓ గణేశ ఆలయంలో మాత్రం ‘బోబా టీ’గా పిలిచే బబుల్ మిల్క్ టీని వినాయకుడికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు.

బ్యాంకాక్‌లోని యూనియన్ మాల్ సమీపంలో ఉన్న గణేశ ఆలయంలో ఈ ప్రత్యేకమైన సంప్రదాయం కనిపిస్తోంది. ఆలయానికి వచ్చే భక్తులు మోదకాలు, లడ్డూలకు బదులుగా తమకు ఇష్టమైన బోబా టీ కప్పులను గణేశుడికి నైవేద్యంగా సమర్పిస్తున్నారని థాయ్ కంటెంట్ క్రియేటర్ ప్రియా పింగ్ వెల్లడించారు.

భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరిన తర్వాత మొక్కు చెల్లింపులో భాగంగా పెద్ద సంఖ్యలో బోబా టీ కప్పులను గణేశుడికి సమర్పిస్తారని ఆమె తెలిపారు. కొందరు భక్తులు వందల సంఖ్యలో బోబా టీ కప్పులను కూడా నైవేద్యంగా సమర్పించే సందర్భాలు ఉంటాయని పేర్కొన్నారు.

తాము ఇష్టపడే ఆహారాన్ని దేవుడికి సమర్పించడం అక్కడి భక్తుల సంప్రదాయంగా కొనసాగుతోందని ప్రియా పింగ్ వివరించారు. అందులో భాగంగానే బోబా టీకి కూడా గణేశుడి ఆలయంలో ప్రత్యేక స్థానం ఏర్పడినట్లు తెలుస్తోంది. వినాయకుడికి బబుల్ మిల్క్ టీని నైవేద్యంగా సమర్పించే ఈ వినూత్న విధానం ప్రస్తుతం ఆసక్తిని కలిగిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana