కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి. కిషన్‌రెడ్డి హైదరాబాద్ మాదాపూర్‌లోని హోటల్ దస్పల్లాలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన పలు కీలక రాజకీయ అభివృద్ధి సామాజిక-ఆర్థిక అంశాలపై ఆయన మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మౌలిక వసతుల అభివృద్ధికి చేస్తున్న పెట్టుబడులు రాష్ట్రానికి కేటాయించిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల వివరాలను ఆయన వెల్లడించారు.
ప్రజా పరిపాలన తెలంగాణలో పాలన తీరుతో పాటు ప్రాంతీయ మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహకారంపై కిషన్‌రెడ్డి వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
తెలంగాణలో పారదర్శక పాలన ప్రజా సంక్షేమం సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని కొనసాగిస్తుందని ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
