DET:NOV 10:
చిరంజీవికి ఆర్జీవీ క్షమాపణ:
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారు,మెగాస్టార్ చిరంజీవి గారికి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.దీనికి కారణం, ఆర్జీవీ దర్శకత్వం వహించిన శివ చిత్రం రీ-రిలీజ్ సందర్భంగా చిరంజీవి ఆ సినిమాను మెచ్చుకుంటూ,వర్మ విజన్‌ను పొగుడుతూ ఒక వీడియో విడుదల చేయడమే.చిరంజీవి ప్రశంసలకు స్పందించిన ఆర్జీవీ,అనుకోకుండా నా మాటలు లేదా చేతలు మిమ్మల్ని బాధపెట్టి ఉంటే,ఈ సందర్భంగా హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను” అంటూ ట్వీట్ చేశారు.

గతంలో జరిగిన సంఘటనలు :
రామ్ గోపాల్ వర్మ గారు తరచుగా సోషల్ మీడియాలో చిరంజీవి గారిని,మెగా ఫ్యామిలీని ఉద్దేశిస్తూ విమర్శనాత్మక వ్యాఖ్యలు చేస్తూ ఉండేవారు.గతంలో చిరంజీవి,ఆర్జీవీ కాంబినేషన్‌లో వినాలని ఉంది అనే సినిమా మొదలై మధ్యలో ఆగిపోవడం కూడా వారి మధ్య కొంత దూరం పెరగడానికి కారణమైంది.అయినప్పటికీ,శివ సినిమా గొప్పతనాన్ని చిరంజీవి గుర్తించి,ఆర్జీవీని అభినందించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.

అభిమానుల తీర్పు: వెనక్కి తీసుకోలేరు:

ఆర్జీవీ అనుకోకుండా బాధపెట్టి ఉంటే క్షమాపణ చెబుతున్నానని చెప్పడంపై చాలా మంది అభిమానులు సంతృప్తి చెందలేదు.కొందరు అభిమానులు,మీరు కావాలనే చేసిన పనులను ఇప్పుడు అనుకోకుండా అని చెప్పి వెనక్కి తీసుకోలేరు” అంటూ ఘాటుగా స్పందించారు.వర్మ క్షమాపణను కొంతమంది ఆలస్యంగా వచ్చిన స్పందనగా కొట్టిపారేశారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana