
DET:NOV 10:
జేసన్ సంజయ్ తొలి సినిమా టైటిల్ ప్రకటన :
తళపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ చాలా రోజుల నిరీక్షణ తర్వాత తన దర్శకత్వ తొలి చిత్రం టైటిల్ను అధికారికంగా ప్రకటించారు.ఈ చిత్రానికి ‘సిగ్మా’ అని పేరు పెట్టారు.ఈ సినిమా సుదీప్ కిషన్ హీరోగా నటిస్తుండగా,దీనిని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.టైటిల్ పోస్టర్ విడుదలైంది,అది చాలా ఉత్సాహాన్ని రేకెత్తించింది.ఈ చిత్రం యాక్షన్,అడ్వెంచర్,కామెడీ అంశాలతో కూడిన కథాంశం అని తెలుస్తోంది.
జేసన్ సంజయ్ విద్యా అర్హతలు:
నటుడిగా కాకుండా తెర వెనుక ఉండాలని నిర్ణయించుకున్న జేసన్ సంజయ్,సినిమా రంగంలో తన పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు.
టొరంటో ఫిల్మ్ స్కూల్ :
ఇక్కడ ఫిల్మ్ ప్రొడక్షన్ డిప్లొమాను పూర్తి చేశారు.సౌత్ వెస్ట్ లండన్ ఇక్కడ ప్లే రైటింగ్ మరియు స్క్రీన్ రైటింగ్ లో బ్యాచిలర్ డిగ్రీని BA Hons పొందారు.
ఈ విద్యార్హతలు,ఆయన దర్శకత్వ ప్రతిభకు మరింత బలం చేకూరుస్తాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
జేసన్ సంజయ్ వృత్తి ప్రస్థానం:
జేసన్ సంజయ్ సినీ రంగంలో తన ప్రయాణాన్ని దర్శకుడిగా ప్రారంభించినప్పటికీ,అంతకుముందే కొన్ని చిన్న ప్రయత్నాలు చేశారు.బాలనటుడిగా 2009లో వచ్చిన ‘వేట్టైకారం’ చిత్రంలో ఒక పాటలో బాలనటుడిగా కనిపించారు.
షార్ట్ ఫిల్మ్స్:
ఆయన దర్శకత్వ ప్రతిభను ‘పుల్ ది ట్రిగ్గర్’ అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా చాటుకున్నారు.ఇది యూట్యూబ్లో విడుదలై మంచి స్పందన పొందింది,ఆయనలోని సినిమా విజన్ ను అభినందించేలా చేసింది.తొలి చిత్రం ఇప్పుడు ‘సిగ్మా’ తో ఒక పూర్తి స్థాయి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
