D Spiritual: Sep 23:తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపధ్యంలో ఈ రోజు సాయంత్రం ఈ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. ఈ ఘట్టంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవ ఘట్టాలకు బీజం పడుతుంది. ఈ రోజు రాత్రి 7 నుంచి 8 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం నిర్వహించనున్నారు.

తిరుమల శ్రీవారి భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్వామివారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు రానేవచ్చేశాయి. సెప్టెంబర్ 24వ తేదీ నుంచి ప్రారంభమకానున్న ఈ బ్రహ్మోత్సవాలకు ఈ రోజు సాయంత్రం వేదపండితులు అంకురార్పణ చేయనున్నారు. వైఖానస ఆగమ సాంప్రదాయం ప్రకారం ఈ రోజు రాత్రి 7 నుంచి 8 గంటల మధ్యలో నిర్వహించే అంకురార్పణ ఘట్టంతో ఈ బ్రహ్మోత్సవాలకు బీజం పడనుంది.

స్వామివారి ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి వైదిక ఉత్సవానికి ముందు అంకురార్పణ చేపడతారు. నవధాన్యాలను మొలకెత్తించి ఈ భూమండలమంతా పాడిపంటలతో, పశుపక్ష్యాదులతో సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తారు.

సేనాధిపతి ఉత్సవం: ఈ సందర్భంగా శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడు శ్రీ విష్వక్సేనులవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు చేపడతారు. జగద్రక్షకుడైన శ్రీవారికి నిర్వహించే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు శ్రీ విష్వక్సేనులవారు ఈ విధంగా మాడ వీధుల్లో ఊరేగుతారని పురాణ ప్రాశస్త్యం.

ముందుగా మేదినిపూజ: అంకురార్పణ సమయంలో వేసే నవధాన్యాలు మొలకెత్తేందుకు అవసరమైన పుట్టమన్ను కోసం ముందుగా భూదేవిని ప్రసన్నం చేసుకునేందుకు మేదినిపూజ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు భూసూక్తాన్ని పఠిస్తారు.

అంకురార్పణ: వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ముందుగా మట్టికుండల్లో పుట్టమన్ను నింపుతారు. ఈ కుండల్లో నవగ్రహాలకు సంకేతంగా నవధాన్యాలు పోస్తారు. సూర్యుడుకి సంకేతంగా గోధుమలు, చంద్రుడుకి బియ్యం, కుజుడుకి కందులు, బుధుడుకి పెసలు, బృహస్పతికి శనగలు, శుక్రుడుకి అలసందలు, శనీశ్వరునికి నువ్వులు, రాహువుకి మినుములు, కేతువుకి ఉలవలు సమర్పిస్తారు.

ఇలా పోసిన నవధాన్య విత్తనాలు బాగా మొలకెత్తాలని, సమస్త భూమండలం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఓషధీ సూక్తాలను పఠిస్తారు. అంతేకాదు, యాగశాలలో ఈ మట్టికుండల చుట్టూ అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశానతో పాటు మొత్తం 49 మంది దేవతలను ఆవాహన చేస్తారు.

అక్షతారోపణ: ఈ మట్టికుండల్లోని నవధాన్యాలను బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజుల పాటు పెంచుతారు. చివరి రోజున ఈ మొలలను వేరుచేసి స్వామివారికి అక్షతారోపణ చేస్తారు. ఈ మొలకలు ఎంత గొప్పగా చిగురిస్తే బ్రహ్మోత్సవాలు అంత సంప్రదాయంగా, ఘనంగా జరిగినట్లు భక్తుల విశ్వాసం.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana