
D Spiritual: Dec 15: ఆదివారం సెలవు దినం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ప్రస్తుతం 19 కంపార్టుమెంట్లలో దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సుమారు 12 గంటల్లో సర్వదర్శనం కల్పిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు.
నిన్న శ్రీవారిని మొత్తం 81,348 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,150 మంది భక్తులు తమ తలనీలాలను స్వామివారికి సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీకి సుమారు రూ.4 కోట్ల ఆదాయం లభించినట్లు అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు రచించిన ‘శ్రీవారి దివ్య ప్రసాదములు’ అనే పుస్తకాన్ని టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో వైఖానస ఆగమోక్తంగా శ్రీవారికి నిర్వహించే కైంకర్యాల్లో నివేదించే అన్న ప్రసాదాలపై సమగ్ర సమాచారం పొందుపరిచినట్లు రచయిత రమణ దీక్షితులు తెలిపారు.
