D Spiritual: Feb 19: తిరుమల శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) మరో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. కొండపై భక్తులు పాదరక్షలను ఎక్కడికక్కడ వదిలేయడం వల్ల అవి కనిపించకపోవడం, అపరిశుభ్రత ఏర్పడడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా టీటీడీ క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ ఫుట్‌వేర్ ట్రాకింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా భక్తులు తమ పాదరక్షలను సురక్షితంగా భద్రపరచుకోవచ్చు.

ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. పాదరక్షలు ఎక్కడ భద్రపరచాలో తెలియక చాలామంది రోడ్ల పక్కనే వదిలేస్తున్నారు. ఇప్పటికే టీటీడీ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ, రద్దీ కారణంగా డిపాజిట్ చేయడానికి లేదా తిరిగి తీసుకోవడానికి ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సరికొత్త టెక్నాలజీ ఆధారంగా క్యూఆర్ కోడ్ వ్యవస్థను అమలు చేస్తున్నారు.

ఈ క్యూఆర్ ఆధారిత పాదరక్షల ట్రాకింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా భక్తులు సులభంగా తమ పాదరక్షలను డిపాజిట్ చేసి, అవసరమైనప్పుడు వెంటనే తిరిగి పొందవచ్చు. గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభమైన ఈ విధానం ప్రస్తుతం కొన్ని కౌంటర్లలో మాత్రమే అందుబాటులో ఉంది. భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేసేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తోంది. త్వరలో కళ్యాణకట్ట, ఏటీసీ సర్కిల్, బేడి ఆంజనేయస్వామి ఆలయం ప్రాంతాల్లో ఈ స్మార్ట్ పాదరక్షల కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని కోరమాండర్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ సహకారంతో నిర్వహిస్తున్నారు.

ఈ స్మార్ట్ వ్యవస్థ అమలులోకి వచ్చిన తర్వాత తిరుమలలో పరిశుభ్రత మెరుగుపడిందని టీటీడీ తెలిపింది. ఇప్పటివరకు 8,45,816 మంది భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. మరిన్ని ప్రాంతాల్లో విస్తరించడం ద్వారా భక్తులకు ఇంకా ఎక్కువ సౌలభ్యం కలగనుంది. అయితే కొంతమంది భక్తులకు అవగాహన లేకపోవడంతో ఈ సేవను ఉపయోగించుకోలేకపోతున్నారు. అందుకే ఈ సదుపాయంపై అవగాహన పెంచేందుకు టీటీడీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. ఈ విధానం ద్వారా పాదరక్షల భద్రపరిచే కేంద్రాల్లో రద్దీ కూడా గణనీయంగా తగ్గినట్లు అధికారులు పేర్కొన్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana