D Spiritual: Feb 19: ఇంద్రకీలాద్రి పై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం పరిధిలోని శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో రాత్రి 7 గంటలకు ద్వాదశి ప్రదక్షిణలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ దంపతులు, ఆలయ ఈఓ రామచంద్ర సీనా నాయక్ దంపతులు, పాలకమండలి సభ్యులు శ్రీ ఆవారు శ్రీనివాసరావు, శ్రీమతి పద్మావతి, శ్రీమతి సరోజిని పద్మశేఖర్ మరియు శ్రీమతి సరిత తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ ఈ సేవ మూడు రోజుల పాటు ఏకాంత సేవగా అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించబడుతుందని తెలిపారు.

సింగపూర్ నివాసులైన శ్రీ విపిన్ కుమార్ మరియు వారి ధర్మపత్ని శ్రీమతి ప్రవీణ్ కుమారి గారు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి నిత్య అన్నదాన పథకం కోసం రూ.1,00,000 విరాళం అందజేశారు. అలాగే గుంటూరు జిల్లా, ఈస్ట్ అమరావతి రోడ్డు, గోరంట్లకు చెందిన మేడి కొండూరు కృష్ణమూర్తి, ఉమామహేశ్వరి దంపతులు శ్రీ అమ్మవారి అన్నప్రసాదం నిమిత్తం రూ.1,00,001 విరాళాన్ని సమర్పించారు. ఈ నెల 21వ తేదీ (శనివారం) ఉదయం 8:00 గంటలకు మల్లికార్జున మహామండపం 6వ అంతస్తులో లెక్కింపు నిర్వహించనున్నట్లు ఈఓ వికె శీనా నాయక్ తెలిపారు.

శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఫాల్గుణ పౌర్ణమి రోజున, అనగా 03-03-2026 మంగళవారం మధ్యాహ్నం సంభవించనున్న కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా, దేవస్థాన వైదిక కమిటీ సూచనల మేరకు ఆగమ శాస్త్ర ప్రకారం ఉదయం 10:00 గంటలకు శ్రీ అమ్మవారి ప్రధాన ఆలయం మరియు ఇతర ఉపాలయాల కవాట బంధనం చేయనున్నట్లు తెలిపారు. తిరిగి 04-03-2026 బుధవారం తెల్లవారుఝామున 3:00 గంటలకు ప్రధాన ఆలయం మరియు ఉపాలయాల కవాటాలు తెరిచి, దేవతామూర్తులకు స్నపనాభిషేకాలు నిర్వహించిన అనంతరం అర్చన, మహానివేదన, హారతి కార్యక్రమాలు నిర్వహించి, ఉదయం 8:00 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు తెలియజేశారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana