
DSports Jan6 2026:న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 వేలంలో భారీ ధర పలికి వార్తల్లో నిలిచిన ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా అమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి, రాబోయే సీజన్‌పై తన లక్ష్యాలను స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆమెను రూ. 1.30 కోట్ల భారీ ధరకు మళ్లీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీచరణి మాట్లాడుతూ, ఈసారి ఢిల్లీ జట్టు ఖచ్చితంగా టైటిల్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
“ఢిల్లీ క్యాపిటల్స్ నాకు ఒక కుటుంబం లాంటిది. ఇక్కడి కోచ్‌లు, ఆటగాళ్లతో నాకు మంచి అనుబంధం ఉంది. వేలంలో మళ్లీ నన్ను ఎంచుకున్నందుకు చాలా గర్వంగా ఉంది.” “గత సీజన్లలో మేము ఫైనల్ వరకు వెళ్లినా కప్‌ను ముద్దాడలేకపోయాం. కానీ ఈసారి మా జట్టు చాలా బలంగా ఉంది. ఈసారి పక్కాగా కప్ గెలుస్తామనే నమ్మకం నాకుంది. జట్టు విజయంలో నా వంతు పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నాను.”
