This Is How Fans Should Be.. Allu Arjun’s Fans Win Praise for Their Nationwide Social Service!

D News: అభిమానమంటే కేవలం సినిమా చూడటం, హీరోను పొగడటం మాత్రమే కాదని నిరూపిస్తున్నారు అల్లు అర్జున్ అభిమానులు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతూ తమ అభిమానానికి సరికొత్త అర్థం చెబుతున్నారు. ఇందులో భాగంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) చేపట్టిన ఓ భారీ అవగాహన కార్యక్రమం ఇప్పుడు ప్రత్యేకంగా నిలుస్తోంది.

8 రాష్ట్రాల్లో 820 అవేర్‌నెస్ కార్యక్రమాలు

కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘స్వస్థ్ నారీ వికసిత్ భారత్’ కార్యక్రమంలో భాగంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై అవగాహన కల్పించేందుకు AAFA దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించింది. మొత్తం 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 820 స్కూల్ అవేర్‌నెస్ ఈవెంట్స్ నిర్వహించినట్లు సమాచారం.

ఈ కార్యక్రమాల ద్వారా దాదాపు 3 లక్షల మంది యువతులకు అవగాహన కల్పించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఒడిశా, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, అండమాన్–నికోబార్ ప్రాంతాల్లో స్కూళ్లు, కమ్యూనిటీల్లో ఈ కార్యక్రమాలు చేపట్టారు.

మంచి పని కోసం ఒక్కటైన అభిమానులు

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన పెంచడం ద్వారా బాలికలు, యువతులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఏడాది ఒక మంచి సామాజిక కార్యక్రమం చేపట్టాలనే ఆలోచనతో అభిమానులు ముందుకు సాగడం ఇప్పుడు ప్రశంసలు అందుకుంటోంది.

‘రాకా’తో బన్నీ బిజీ

ఇక సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ **‘రాకా’**తో బిజీగా ఉన్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె కీలక పాత్రలో నటిస్తున్నారు. రష్మిక మందన్నా, మృణాళ్ ఠాకూర్ తదితరులు కూడా భాగమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.

By Avinash

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana