
D Spiritual: Dec 3: అనేక మతాచారాల్లో కొన్ని మొక్కలు ఆధ్యాత్మిక చిహ్నాలుగా నిలిచాయి. వాటిలో ముఖ్యంగా తామర పువ్వు ఒకటి. ఇది పవిత్రతకు, అందానికి ప్రతీకగా భావించబడుతుంది. విష్ణువు నాభి నుంచి ఆవిర్భవించిన తామర పుష్పం నుంచే బ్రహ్మదేవుడు ఉద్భవించాడని హిందూ పురాణాలు చెప్తున్నాయి.
భూ తులసి (బేసిల్) క్రైస్తవ మతంలో పవిత్రమైన మొక్కగా గుర్తించబడింది. యేసు రక్తం చిందిన చోట ఈ మొక్క మొలిచిందని క్రైస్తవులు విశ్వసిస్తారు. అందుకే దీనికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది.
ప్రియోటి ప్లాంట్ (Peyote) టెక్సాస్, మెక్సికో ఎడారుల్లో పెరిగే జెముడు మొక్క. స్థానిక ఆదివాసులు దీనిని పూర్వం నుండి దేవుడితో సంభాషించేందుకు ఉపయోగిస్తున్నారు. ఈ మొక్కను వారి ఆచారాల్లో పవిత్రంగా పరిగణిస్తారు.
