DSports 21Feb 2026:కొలంబో: ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న భారత డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఎట్టకేలకు నోరు విప్పారు. తన ఆటతీరుపై వస్తున్న విమర్శలను తోసిరాజంటూ, తన శైలిని మార్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సూపర్-8 దశలో భాగంగా దక్షిణాఫ్రికాతో జరగనున్న కీలక పోరుకు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు.

  • “నేను నా హార్డ్ వర్క్‌ని మాత్రమే నమ్ముతాను. రెండేళ్ల క్రితమే ఇలాంటి చిన్న విషయాలకు ఒత్తిడి తీసుకోవడం మానేశాను. కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజం. కొన్నిసార్లు పరుగులు వస్తాయి, కొన్నిసార్లు రావు. అంతమాత్రాన నా సహజ సిద్ధమైన ఆటను మార్చుకోలేను.”
  • తొలి బంతి నుంచే భారీ షాట్లు ఆడే ప్రయత్నంలో వికెట్ పారేసుకుంటున్నారన్న విమర్శలపై ఆయన స్పందిస్తూ.. తాను మొదటి నుంచి ఇలాగే ఆడుతున్నానని, తన దూకుడైన ఆటతీరు వల్లే జట్టులోకి వచ్చానని గుర్తు చేశారు. “ఏమి జరిగినా సరే, నా బ్యాటింగ్ శైలిలో మార్పు ఉండదు. ఇదే దూకుడును రాబోయే మ్యాచ్‌ల్లోనూ కొనసాగిస్తా” అని ధీమా వ్యక్తం చేశారు.
  • దిగ్గజాల సూచనలుమరోవైపు, సునీల్ గవాస్కర్, హర్భజన్ సింగ్ వంటి దిగ్గజాలు అభిషేక్ ఆటతీరుపై స్పందించారు. “అభిషేక్ అద్భుతమైన ఆటగాడు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అంచనాల భారం అతనిపై పడుతోంది. మొదటి బంతికే ఫోర్ లేదా సిక్స్ కొట్టాలని చూడకుండా, క్రీజులో కాసేపు సమయం గడపాలి” అని సూచించారు.భారీ షాట్ల కోసం ప్రయత్నించే ముందు పిచ్‌ను అర్థం చేసుకోవాలని సలహా ఇచ్చారు.

By Deepak

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana