
D News: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘డ్రాగన్’ షూటింగ్ మళ్లీ జోరందుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో సర్జరీ చేయించుకున్నారు. వైద్యుల సూచన మేరకు కొంతకాలం విశ్రాంతి తీసుకోవడంతో సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది.
తాజా సమాచారం ప్రకారం.. షోల్డర్ సర్జరీ నుంచి కోలుకున్న ఎన్టీఆర్ మళ్లీ ‘డ్రాగన్’ సెట్స్‌లోకి అడుగుపెట్టినట్లు టాక్. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ షెడ్యూల్లో ముందుగా కీలకమైన టాకీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఆ తర్వాత భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను షూట్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఈ యాక్షన్ బ్లాక్స్‌ను భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
లూగర్ ఎంట్రీపై టాక్
ఇదిలా ఉంటే.. ‘డ్రాగన్’ యాక్షన్ పార్ట్ కోసం లూగర్ రంగంలోకి దిగినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ధృవీకరణ రాలేదు.
ఇప్పటికే షూటింగ్ ఆలస్యం కావడంతో ఇకపై వరుస షెడ్యూల్స్‌తో పనులు వేగంగా పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.కాగా, రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు.
