
D News : నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. ముఖ్యంగా నైజాం ప్రాంతంలో కలెక్షన్ల జోరు కొనసాగుతున్నట్లు ట్రేడ్ వర్గాల గణాంకాలు చెబుతున్నాయి.
నైజాంలో రూ.27.5 కోట్ల షేర్
తొలి వారంలో నైజాం ఏరియాలో ‘ది ప్యారడైజ్’ సుమారు రూ.27.5 కోట్ల షేర్ అందుకున్నట్లు సమాచారం. ఆదివారం ఒక్కరోజే దాదాపు రూ.4.7 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ లెక్కలు జీఎస్టీ మినహాయించి ఉన్నట్లు సమాచారం.
సినిమా కథనం, నిడివి, కొన్ని సన్నివేశాలపై ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా.. నైజాం మార్కెట్లో మాత్రం వసూళ్లపై పెద్దగా ప్రభావం కనిపించలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు పలు కేంద్రాల్లో తొలి వారాంతంలో ఆక్యుపెన్సీ బలంగా నమోదైనట్లు తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా భారీ ఓపెనింగ్
ఇక వరల్డ్‌వైడ్‌గా కూడా ‘ది ప్యారడైజ్’ మంచి వసూళ్లను నమోదు చేసింది. మూడు రోజుల్లోనే రూ.136 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు చిత్రబృందం ప్రకటించింది. నార్త్ అమెరికాలోనూ 20 లక్షల డాలర్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం.
అయితే తొలి వారాంతం పూర్తయిన నేపథ్యంలో ఇక సాధారణ రోజుల్లో సినిమా కలెక్షన్లు ఎలా ఉంటాయన్నది కీలకంగా మారింది. ముఖ్యంగా నైజాం ప్రాంతంలో సోమవారం నుంచి వసూళ్లు ఏ స్థాయిలో కొనసాగుతాయన్నది ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.
