
D News : దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, తమిళ స్టార్ హీరో సూర్య కాంబినేషన్‌పై మరోసారి చర్చ మొదలైంది. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తారనే వార్తలు చాలాకాలంగా వినిపిస్తున్నా.. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
తాజాగా చెన్నైలో జరిగిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ కార్యక్రమంలో రాజమౌళికి సూర్యతో సినిమా గురించి ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్న తనకు వస్తుందని ముందే ఊహించానని ఆయన సరదాగా చెప్పారు. అయితే ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను ఇప్పుడే వెల్లడించేందుకు మాత్రం రాజమౌళి ఆసక్తి చూపలేదు.
‘ఇప్పుడే చెబితే అంతా అదే మాట్లాడతారు’
తాను ఏదైనా పెద్ద విషయాన్ని బయటపెడితే.. ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమం కంటే అందరూ ఆ విషయంపైనే చర్చిస్తారని రాజమౌళి వ్యాఖ్యానించారు. అందుకే సూర్యతో సినిమా గురించి ఎలాంటి వివరాలు చెప్పడం లేదన్నట్టుగా సమాధానం ఇచ్చారు.
అయితే అభిమానుల ఆసక్తిని మరింత పెంచేలా.. భవిష్యత్తులో తాను, సూర్య కలిసి సినిమా చేస్తే అది ప్రత్యేకంగా ఉంటుందని రాజమౌళి అన్నారు. ఆ సమయంలో సూర్య కూడా అక్కడే ఉండటంతో ఆయన నవ్వుతూ స్పందించడం ఆసక్తికరంగా మారింది.
రాజమౌళి–సూర్య కాంబినేషన్‌పై గతంలోనూ ఎన్నో వార్తలు, ఊహాగానాలు వచ్చాయి. తాజాగా రాజమౌళి చేసిన వ్యాఖ్యలతో ఈ కాంబినేషన్‌పై మరోసారి ఆసక్తి పెరిగింది. అయితే సినిమా ఎప్పుడు మొదలవుతుంది? కథ ఏంటి? అనే విషయాలపై మాత్రం ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదు.
