
DSports 24Jan 2026: టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. రాయ్‌పూర్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించడంతో కివీస్ బ్యాటర్లు ఆరంభం నుంచే భారీ షాట్లతో విరుచుకుపడ్డారు.
- చివరిలో కెప్టెన్ సాంట్నర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 27 బంతుల్లో 47 పరుగులు (6 ఫోర్లు, 1 సిక్స్) చేసి నాటౌట్‌గా నిలిచి జట్టు స్కోరును 200 దాటించాడు.
- యువ బ్యాటర్ రచిన్ రవీంద్ర 26 బంతుల్లో 44 పరుగులు (2 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి ఇన్నింగ్స్ మధ్యలో స్కోరు బోర్డును పరిగెత్తించాడు.
- ఓపెనర్లు డెవాన్ కాన్వే (19), టిమ్ సీఫెర్ట్ (24) తొలి 3 ఓవర్లలోనే 43 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు.
- టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా తలో వికెట్ పడగొట్టారు.
