DSports 24Jan 2026: రాయ్‌పూర్‌:చాలా కాలం తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (SKY) తన అసలైన శైలిలో విరుచుకుపడ్డారు. రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20లో సూర్య కేవలం 37 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. దాదాపు ఏడాదిన్నర (468 రోజులు) విరామం తర్వాత సూర్య బ్యాట్ నుంచి వచ్చిన మెరుపు హాఫ్ సెంచరీ ఇది.

  • వన్ డౌన్ బ్యాటర్‌గా వచ్చిన ఇషాన్ కిషన్ ఆరంభం నుంచే కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఆయన 32 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 76 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేశారు. కేవలం 6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్‌ను సూర్య-ఇషాన్ ద్వయం ఆదుకుంది. వీరిద్దరూ మూడో వికెట్‌కు కేవలం 49 బంతుల్లో 122 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. న్యూజిలాండ్ నిర్దేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ కేవలం 15.2 ఓవర్లలోనే పూర్తి చేయడం విశేషం. చివర్లో శివమ్ దుబే (18 బంతుల్లో 36 నాటౌట్) కూడా మెరుపులు మెరిపించడంతో భారత్ మరో 28 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
  • “నేను అవుట్ ఆఫ్ ఫామ్ కాదు, కేవలం పరుగులు మాత్రమే రాలేదు” అని తన ఫామ్‌పై విమర్శలు చేసిన వారికి సూర్య తన బ్యాట్‌తోనే సమాధానమిచ్చారు.